ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్పూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆదర్శంగా ముందుకు సాగాలని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉద్బోధించారు.హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలిలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవ చిరస్మరణీయమన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్పూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు అంబటి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కొరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.