ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటు కున్నాడు. ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబుల్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థల నుండి ‘సూపర్ టాలెంటెడ్ కిడ్’ అవార్డులు అందుకున్నాడు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాలుని, అతని తల్లిదండ్రులను అభినందించారు. శాలువాతో సన్మానించి, మెడల్స్, సర్టిఫికెట్లు సాధించడం జిల్లాకు గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా బాలుడిని ప్రోత్సహించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తన ఛాంబర్‌లో బాలుడికి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.