Take a fresh look at your lifestyle.

బుద్ధుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నటుడు -గగన్ మాలిక్

 

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ​, ఫిబ్రవరి 17: హైదర్‌నగర్ 

గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బౌద్ధ ధర్మ ప్రచారకుడు గగన్ మాలిక్ పిలుపునిచ్చారు. బుద్ధ ధమ్మయాత్ర మూడవ వార్షికోత్సవం సందర్భంగా కర్ణాటక నుండి హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ వరకు సుమారు 80 మంది బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర మంగళవారం హైదర్‌నగర్‌కు చేరుకుంది.ఈ సందర్భంగా హైదర్‌నగర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు యాత్రికులకు ఘనంగా స్వాగతం పలికారు.

గగన్ మాలిక్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బౌద్ధమతంలోని పంచశీల సూత్రాలైన అహింస, అస్తేయం (దొంగతనం చేయకపోవడం), సత్యం, బ్రహ్మచర్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు.
​ఈ కార్యక్రమంలో హైదర్‌నగర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.