బంగారం దిగుమతులపై పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలి బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరి నారాయణ భట్టడ్
నిర్మానుష్యంగా పేట సరఫ్ బజార్…జిల్లా కేంద్రం
ముద్ర, నారాయణపేట :
బంగారు దిగుమతులపై కేంద్రం పెంచిన సుంకాన్ని వెంటనే తగ్గించాలని నారాయణపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు హరి నారాయణ భట్టడ్ డిమాండ్ చేశారు. బంగారు దిగుమతులు, సిల్వర్ బులియన్ దిగుమతులపై పెరుగుతున్న నియంత్రణలు, ఏ ఎ స్కీం కింద బంగారు దిగుమతులపై విధించిన పరిమితుల పై నారాయణపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పేట సరాఫ్ బజార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరి నారాయణ భట్టడ్ మాట్లాడారు. బంగారు వ్యాపార రంగానికి సంబంధించి లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అంతేకాకుండా బంగారు ధరల పెరిగితే నిరుపేదల పెళ్లిలు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితిలు ఉన్నాయన్నారు. బంగారు దిగుమతులపై నియంత్రణలు పెరగడం వల్ల దేశవ్యాప్తంగా బంగారు వెండి సరఫరా వ్యవస్థలో అనిచ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దీని ప్రభావం పెద్ద వ్యాపారులకే కాకుండా చిన్న మరియు మధ్యతరగతి బంగారు దుకాణాలపై, బంగారు ఆభరణాల తయారీ కార్మికుల ఉద్యోగులపై ఎంతగానో ప్రభావం చూపుతుందన్నారు. దేశవ్యాప్తంగా జ్యువెలరీ పరిశ్రమ అనేది అత్యధిక ఉపాధిని కల్పించే ప్రధాన రంగమని గుర్తు చేశారు. చిన్న మరియు మధ్యతరగతి బంగారు దుకాణాల కు అనుకూలమైన విధానాలు రూపొందించాలన్నారు. జువెలరీ రంగానికి ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. బులియన్ మర్చంట్ రంగంలో పారదర్శకతతో సులభ వ్యాపార వాతావరణం కల్పించాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందించారు. బులియన్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ చామకూర, కోశాధికారి వెంకటయ్య, షఫీ చాంద్, దస్తగిరి చాంద్, పవన్ కుమార్ వైకుంట్ , వామన్ గేరి కార్తీక్, సాకేత్ భట్టడ్, సంగంనాథ్ హీరే మఠ్ లతో పాటు మరికల్, మక్తల్, మద్దూరు మండలాల నుంచి బులియన్ వ్యాపారాలు పాల్గొన్నారు.