Take a fresh look at your lifestyle.

హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోండి: ఎస్పీ కె. నరసింహ సూచనలు

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం  

– హోలీ ఉత్సవం జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉండాలి.
– ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దు.
– ఇష్టపడని వారిపై రంగులు చల్లోద్దు.

…. కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

హోలీ పండుగ సందర్భంగా ఉత్సవం జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉంటూ సంతోషకర వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. రహదారులపై క్రమశిక్షణతో ఉండాలి అని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో పరిసరాలను గమనించాలని కోరారు. రంగులు ఇష్టపడని వ్యక్తులపై బలవంతంగా రంగులు చల్లవద్దు అని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు, మద్యం మత్తులో వాహనాలు నడకకూడద కోరారు. ఉత్సవం విషాదం కాకూడదు అని అన్నారు.

రసాయన రంగులు ఉపయోగిస్తే అనారోగ్యం కలిగే అవకాశం ఉన్నది, కావున సంప్రదాయ రంగులతో హోళీ జరుపుకోవాలని కోరారు. నివాసాలపై, ప్రార్థనా మందిరాలపై రంగులు చల్లకూడదు. పండుగ అంతరం ఎవరుకుడా లోతైన నీటిలోకి, నీటి ప్రవాహం ఉన్న కాల్వలోకి ఈతలకు వెళ్ళకూడదు. తొందరపాటు, అత్యుత్సాంతో ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను, మహిళలను గౌరవించాలి అన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వీధుల్లో మరియు బహిరంగ ప్రదేశాలలో గుంపుగా ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాల కదలికలను నిషేధం గలదు. ఇవి శాంతిభద్రతలకు విఘాతం లేదా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తాయి.

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది, గుంపులుగా చేరడం, సభలు, సమావేశాలు, ఊరేగింపులపై నిషేధాజ్ఞలు ఉన్నాయి అని ఎస్పి గారు గుర్తు చేశారు. పోలీసు సూచనలు, నియమాల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

Leave A Reply

Your email address will not be published.