ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం, మై భారత్ ఆధ్వర్యంలో షాహిద్ దివాస్ సందర్బంగా శ్రమదాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా బస్టాండ్ అవరణంలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు సేకరించారు. అనంతరం RSS జిల్లా కార్యవాహ ఆంజనేయులు గారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ను ఉరి తీసిన రోజును ఈరోజు కేంద్ర ప్రభుత్వం షాహిద్ దివాస్ గా ప్రకటించి వారి సేవలను గుర్తుచేసుకోవాలి కోరారు. అతి చిన్న వయసులో ఈ ముగ్గురు బ్రిటిష్ వారి పై చేసిన పోరాటం చాలా గొప్పది అని ప్రాణాలను సైతం లెక్క చెయ్యక దేశం కోసం జీవిత త్యాగం చేసిన మహనీయులు అని కోరారు.అలాగే బీజేపీ కౌన్సిలర్ బోడ నర్సింహా, బీసీ సబ్ ప్లాన్ తాలూక ఆధ్యక్షుడు మ్యాకల రాజేందర్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమం లో సేవా బృందం ఆధ్యక్షుడు శివ కుమార్,సభ్యులు లక్ష్మి నరసింహ, RSS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.