ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం ఏరియా1 జిఎం కార్యలయం లో మంగళవారం గుర్తింపు సంఘం ప్రతినిధులతో, ఆర్జీ1వివిధ విభాగాల అధికారుల తో ఆర్జీ1 జిఎం డి.లలిత్ కుమార్ అధ్యక్షతన ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ గత నెలలో జరిగిన నిర్మాణాత్మక సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు పరిష్కారమయ్యాయని,మరికొన్ని జరగవలసి ఉన్నదని అన్నింటికి సానుకుల వాతావరణంలో పరిష్కారం జరుగుతాయని తెలిపారు.గుర్తింపు సంఘం ప్రతినిధులు వివిధ సమస్యల మీద చర్చించారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, నాయకులు అరెల్లి పోషం, మహేష్, అశోక్, వెంకట రెడ్డి, సిద్దమల్ల రాజు, మల్లిఖార్జున్, పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి, అధికారులు చిలక శ్రీనివాస్, డి.రమేష్, ఆంజనేయులురమేష్, జితేందర్ సింగ్, ధనలక్ష్మి బాయి, అంబిక, వసంత కుమార్, వేణు, హన్మంత రావు, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.