Take a fresh look at your lifestyle.

ఇచ్చోడ లో బంద్ విజయవంతం

  • సిరిచెల్మ లో బంద్ లో పాల్గొన్న ఆదివాసులు

ముద్ర విలేకరి, ఇచ్చోడ: జీవో నంబర్ 49 ని రద్దు చేయాలని డిమాండ్తో తురుము దెబ్బ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రోజున మండల కేంద్రమైన ఇచ్చోడతోపాటు పలు గ్రామాలలో బంద్ విజయవంతమైంది.సోమవారం రోజున బంద్ పాటించాలని ఒక రోజు ముందు దుకాణానికి వెళ్లి ప్రచారం చేయటంతో సోమవారం రోజున బంద్ విజయవంతమైంది. సోమవారం రోజున ఇచ్చోడలో వారాంతపు సంత కావడం వల్ల బంధువల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇచ్చోడలో వ్యాపారస్తులు బందులో పాల్గొన్నారు మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో గల సిరిచెల్మ గ్రామంలో ఆదివాసి నాయకులు బందులో పాల్గొన్నారు. సిరిసిల్ల గ్రామములో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకులు జి ఓ 49 ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు బంధు సందర్భంగా ఇచ్చోడ ఎస్సై పురుషోత్తం ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవ్వాల్సిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.