Take a fresh look at your lifestyle.

UCF నిధులతో కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: కార్పొరేటర్ అంజన్ కుమార్

 

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ సాధనకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తప్పనిసరి: కౌన్సిల్‌లో తీర్మానానికి ఆమోదం

ముద్ర, కరీంనగర్ :

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) నిధుల సాధనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందని కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ గారు తెలిపారు.

నేడు జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో UCF నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టుల ఎజెండాపై మాట్లాడుతూ.. పాత నగర ప్రాంతాల పునరాభివృద్ధి, మార్కెట్ల ఆధునీకరణ, పట్టణ చలనశీలత, లాస్ట్-మైల్ కనెక్టివిటీ, మోటారురహిత రవాణా, నీరు-పారిశుధ్య మౌలిక సదుపాయాలు, వాతావరణ స్థితిస్థాపక పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాలలో పరివర్తనాత్మక ప్రాజెక్టులకు ఈ నిధులు ఉపయోగపడతాయని అన్నారు.

“UCF స్కీం కింద కేంద్ర ప్రభుత్వ సహాయం 25%, రాష్ట్ర ప్రభుత్వం 25%, మిగిలిన 50% బ్యాంకులు లేదా PPP ద్వారా సమకూర్చుకోవాలి. ఈ స్కీం సక్సెస్ కావాలంటే మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సహకారం తీసుకొని, స్వయంగా మునిసిపల్ శాఖ మాత్యులుగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే మనం ఈ నిధులకు ఎలిజిబుల్ అవుతాం” అని అంజన్ కుమార్ స్పష్టం చేశారు.

గతంలో కూడా స్మార్ట్ సిటీ రావడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారమే కారణమని, ఎమ్మెస్సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం తీసుకురావడం వల్లనే నేడు కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎదిగిందని గుర్తుచేశారు. అదే విధంగా UCFను కూడా సాధించుకుంటామని, కాంగ్రెస్ పార్టీ ఈ తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఆమోదిస్తోందని తెలిపారు.

అధికారులపై అసహనం:
అనంతరం అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ.. “24/7 ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ప్రజలకు వారధిగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి.

Leave A Reply

Your email address will not be published.