Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్‌లోనే ఉన్నానన్న దానం.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ

 

నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా : దానం
ప్రచారం జరుగుతున్నట్టు.. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ స్పీకర్‍ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై తాజాగా అఫిడవిట్ సమర్పించిన ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని స్పీకర్ కు దానం విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ తనను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం స్పష్టం చేశారు. 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని చెప్పారు.. అది వ్యక్తిగత హోదాలో మాత్రమేనని వివరణ ఇచ్చారు. మీడియా కథనాల ఆధారంగా పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నట్లు వివరించారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని స్పీకర్ ను కోరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దానం వాదనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? బీఆర్ఎస్ ఎలా స్పందించబోతోంది అనే చర్చ రాజకీయాల్లో ఆసక్తి  రేపుతున్నది.

Leave A Reply

Your email address will not be published.