Take a fresh look at your lifestyle.

మానవ అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి

  • ఎస్పీ నారాయణ రెడ్డి.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: మానవ అక్రమ రవాణా నిలువరించేందుకు ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ తో కలిసి బుధ వారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్య్రమంలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి నడుం బిగించాలని తెలిపారు. బాలల అక్రమ రవాణా పిల్లలపై లైంఘిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సాధన సంస్థ పనిచేయడం హర్షణీయం అన్నారు. పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సాధన ఎన్జీఓ ప్రతినిధులు నర్సింహులు, అంజయ్య, రోజా తదితరులు పాల్గొన్నారు.

  • మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
  1. సాధన, ఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆవాహన
  2. ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేష్

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సాధన ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ పేర్కొన్నారు.బుధవారం వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. సాధన ఎన్జీఓ ఆర్పిఎఫ్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్న విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రమేష్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారి నుంచి బాలబాలికలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఎల్ఏ సెక్రటరీ వెంకటేశం, ఆర్‌పీఎఫ్ ఏఎస్ఐలు ప్రభాకర్, జనార్దన్ రెడ్డి, సాధన ఎన్జీఓ ప్రతినిధులు నర్సింహులు, అంజయ్య, రోజా, ప్రకాష్, ఏహెచ్ టీయూ హెడ్ కానిస్టేబుల్ అలీమోద్దీన్, చైల్డ్ లైన్ ప్రతినిధి మహేష్, జిఆర్పి కానిస్టేబుల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.