ఘన నివాళులు అర్పించిన సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్..
ముఖ్య అతిధులుగా భువనగిరి రూరల్ పోలీస్ సీఐ
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ని పురస్కరించుకొని తాజ్ పూర్ లో గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ పాలకవర్గం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రూరల్ సీఐ చంద్రబాబు, ఎస్ హెచ్ఓ అనీల్ కుమార్ పాల్గొని నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, దళిత పీడిత బహుజన వర్గాల స్వేచ్ఛ కోసం వారు రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి బి. నరేందర్, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ లు, అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించారు.