Take a fresh look at your lifestyle.

గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలి

  • మాజీ ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి.

గొల్లపల్లి, ముద్ర విలేకరి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన చేపూరి మోక్షిత నెల25న హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో మెరుగైన ప్రదర్శన కనబరిచి కాoస్య పతకం గెలిచిన చేపూరి మోక్షతను మాజీ ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి. అభినందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నిరుపేద కుటుంబానికి చెందిన మోక్షిత రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచడం అభినందనీయం అన్నారు గ్రామీన స్థాయిలో ఎంతో మంది క్రీడాకారుల్లో ప్రతిభ దాగి ఉన్నదని సదుపాయాలు లేక వెనక బడుతున్నారని గ్రామీన స్థాయి క్రీడాకారులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే జాతీయ స్థాయి అకాడమీకి మించిన ఫలితాలు తీసుకు వస్తారని క్రీడాకారులకు గ్రామీణ స్థాయిలో సరైన శిక్షణ లేకపోవడంతో క్రీడాకారులు వెనక బడుతున్నారని ఆయన అన్నారు.ఆమె తన విజయానికి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ మహేందర్ పటేల్ కి కృతజ్ఞతలు తెలిపారు.విజయం సాధించిన క్రీడాకారిణిని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ గువ్వా శ్రీనివాస్,డివైఎస్ ఓ రవికుమార్,బీఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి, అసోసియేషన్ సభ్యులు రాజు రాజేందర్, సీనియర్ జాతీయ స్థాయి క్రీడాకారిని సోనియా తదితరులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.