ముద్ర,జగిత్యాల టౌన్: జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళిక అవగాహన ర్యాలీని సోమవారం పట్టణంలో నిర్వహించారు. ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు అనే నినాదంతో పాత బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించడంతోపాటు పలు నినాదాలు చేశారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారుచేసిన వస్తువులను విక్రయశాలను కమిషనర్ స్పందన ప్రారంభించారు. ఇందులో మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
