బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారంహనుమన్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. బోథ్ నియోజక వర్గంలోని నేరడిగొండ మండలం చించోలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన పూలు, ఫలాలతో పూజా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చించోలి హనుమాన్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల వద్ద భజన బృందాలు గీతాలను ఆలపించారు. అన్ని ప్రధాన దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు.