Take a fresh look at your lifestyle.

అమెరికా నుంచి సీఎస్ కు సీఎం ఫోన్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం శనివారం స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.