మాదాపూర్, ముద్ర : శ్రీరామ నవమి పండుగ పర్వదిన వేడుకలలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ ఏ బ్లాక్, రాజా రాజేశ్వరి నగర్, ఓయూ ప్రొఫెసర్ కాలనీ, గోల్డెన్ తులిప్ కాలనీ, జనార్దన్ హిల్స్ కాలనీలలో జరుగుతున్న సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలలో కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీతారామచంద్రుల వారికీ ప్రత్యేక పూజలు చేసి, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి, ప్రతి ఒక్కరికి శ్రీరామ నవమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు సుద్దపల్లి విజయ్ కృష్ణ, జే. బలరాం యాదవ్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, సంతోష్, అజయ్, కొండల విద్యా సాగర్ రెడ్డి, ముప్పా రమణ, విజయ్ శర్మ, పూదోట సౌరయ్య, మద్దిలేటి, శివాజీ, మను సింగ్, కోతి శంకర్, గోపి కృష్ణ రావు, అరుణ్, ఓబుల్ రెడ్డి, శ్రీకాంత్, అజిత్ రెడ్డి, సురేష్, తిరుపతి రావు, సంతోష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.