ముద్ర న్యూస్ బ్యూరో, చెన్నై ఫిబ్రవరి 8: అపోలో ఆసుపత్రుల రీజినల్ సీఈవో ( తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) తేజస్వి రావుకు ఈ ఏడాది ‘బెస్ట్ లీడర్’ అవార్డు లభించింది. ఆదివారం నాడు చెన్నైలో కన్నుల పండువగా జరిగిన అపోలో లీడర్ షిప్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అపోలో ఆసుపత్రుల డైరెక్టర్లు సి.సునీత రెడ్డి, ప్రీతా రెడ్డిల చేతుల మీదుగా తేజస్వీ రావు ఈ అవార్డును స్వీకరించారు.
