Take a fresh look at your lifestyle.

బునాదిగాని కాల్వ నీరు విడుదల

బీబీనగర్, ముద్ర విలేకరి: బీబీనగర్ మండలంలోని బునాదిగాని కాల్వ ద్వారా ఆదివారం ఇరిగేషన్ అధికారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు సాగునీటిని విడుదల చేశారు. భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ఆదేశాల మేరకు ఈ నీటిని రైతులకు విడుదల చేశారు. ఇప్పటికే సాగుతున్న కాలువ పనులు నిలుపదల చేసి మరీ రైతుల అవసరం దృష్ట్యా వెంటనే నీటిని విడుదల చేస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు గోలి పింగళ్ రెడ్డి, పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దాదాపుగా పూర్తికావచ్చిన కాలువ పనులను నిలిపి మరీ నీటిని విడుదలు చేశామన్నారు.రైతులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆదేశించారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బొమ్మగోని ప్రతిభ బసవయ్య గౌడ్, మక్త అనంతారం గ్రామ శాఖ అధ్యక్షులు జంగయ్య, వెంకటేష్, మహేందర్, ఎండి మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.