ముద్ర, ఆత్మకూర్ (ఎం):
యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండల కేంద్రానికి సెకండరీ గ్రేడ్ పోస్టు మాస్టర్ గా ముద్రసాని వెంకటస్వామి బదిలీ అయి భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామిని తన క్లాస్ మేట్ మిత్రులు శుక్రవారం పోస్టాఫీస్ లో కలిసి అభినందించారు. 1998 సంవత్సరంలో ఎక్స్ ట్రా డిపార్ట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధుల్లో చేరిన స్వామి అంచెలంచెలుగా ఎదిగారు. 2007 సంవత్సరంలో డిపార్ట్ మెంటల్ పోటీ పరీక్షలు రాసి పోస్ట్ మేన్ గా ఎంపికయ్యారు. 2013లో పోస్టల్ అసిస్టెంట్, 2026 లో సెకండరీ గ్రేడ్ పోస్టు మాస్టర్ గా పదోన్నతి పొంది ఆత్మకూర్(ఎం)లో బాధ్యతలు స్వీకరించారు. వెంకటస్వామి గత 27 సంవత్సరాలుగా భువనగిరి, టేకులసోమారం, యాదగిరిగుట్ట కేంద్రాల్లో తపాల శాఖ కార్యాలయాల్లో సేవలందించారు. ఆత్మకూర్ మండలం మొర్పిరాల గ్రామానికి చెందిన వెంకటస్వామి తాము చదువుకున్న గ్రామంలో పోస్టల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించడంతో తోటి స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపిన వారిలో జర్నలిస్టులు ఎలిమినేటి జహంగీర్, నగేష్, పోలీసు హెడ్ కానిస్టేబుల్ పర్కాల శ్రీశైలం ఉండగా మిగతా మిత్రులు, స్థానికులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
