* గంజాయి మత్తు పదార్థాలు విచ్చల విడిగా పెరిగిపోవడమే ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది
* అధికార పార్టీ కి చెందిన వ్యక్తి కావడం వల్లే పోలీస్ లు ఇంత ఉదాసినంగా ఉన్నారన్న ఆరోపణలు లు వస్తున్నాయ్..
సిద్దిపేట పోలీసు కమిషనర్, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందజేసిన సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ మహిళ ప్రతినిధుల బృందం
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
కాంగ్రెస్ హయాంలో మహిళలకు భద్రత కరువైందని సిద్దిపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజులా విమర్శించారు. సిద్దిపేట పట్టణ కాళ్లకుంట కాలనీకి చెందిన మహిళపై ఇటీవల సాదుల సాయి ప్రతాప్ అనే వ్యక్తి గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి మహిళను బలవంతంగా బలాత్కారం చేయడం ద్వారా తీవ్రంగా గాయపడి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండం సంపత్ రెడ్డి, పాల సాయిరాం, పట్టణ కౌన్సిలర్లతో కలిసి సోమవారం మహిళను పరామర్శించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు తక్షణ సహాయం క్రింద పదివేల రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్బంగా సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కడవేరు మంజుల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుండి మహిళలకు రక్షణ కరువైందని , రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సక్రమంగా విధులు నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు లోతైన సమాచారాన్ని సేకరించి, బాధితురాలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఈసందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు వడ్లకొండ సాయికుమార్, కొండం కవిత, గోపాలపురం దీప్తి, బంధారం శ్రీలత, దాసరి భాగ్యలక్ష్మి, కాటం శోభారాణి, బీఆర్ఎస్ నాయకురాలు నందాదేవి, బూర విజయ,గాడిపల్లి అరుణ రెడ్డి పాల్గొన్నారు.