Take a fresh look at your lifestyle.

అంతర్ జిల్లా దొంగల ముఠ అరెస్ట్…

 

– 9 మంది అరెస్ట్, పరారీలో ఒకరు

– నిందితుల నుండి 4.6 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బైక్,10 సెల్ ఫోన్లు స్వాధీనం

– వివరాలు వెల్లడించిన సీపీ రష్మీ పెరుమాళ్

 

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సిద్దిపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈనెల నాలుగో తేదీన సిద్దిపేటలోని చేర్విత మెడోస్ లో ఓ డాక్టర్ ఇంట్లో కి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కత్తులతో బెదిరించి వారి ఇంట్లో నుండి నగదును ,బంగారం నగలను తీసుకొని పారిపోయారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విషయంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల గురించి గాలించి , సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి పట్టుకొన్నారు. వివరాల్లోకెళ్తే బెల్లంపల్లికి చెందిన శ్రీకాంత్ అలియాస్ క్రాంతి ఒకప్పుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. తర్వాత రామగుండం ఐఓసీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన జల్సాలకు అలవాటు పడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ పెరగడంతో ఒక పెద్ద రాబరీ దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. బంగారం ఎక్కువగా ఉన్న ఇండ్ల ను టార్గెట్ చేస్తే త్వరగా డబ్బు వస్తుందని ఆలోచించాడు.

తర్వాత తనలాంటి ఆలోచనలు ఉన్న తన మిత్రులు హైదరాబాద్ కు చెందిన రాకేష్ , శ్యామ్ లకు హైదరాబాద్ ఇండ్లు అయితే తన ప్లాన్ కు సరిపోతుందని వాళ్లకు చెప్పాడు. అలాగే తన మరొక స్నేహితుడు గోదావరిఖని చెందిన చంద్రశేఖర్ కు విషయం తెలియజేశాడు. ఈ రాబరీ దొంగతనం చేసే వాళ్ల కోసం వెతుకుతుండగా ఓ రోజు కోర్టు దగ్గర ములుగు కు చెందిన దోపిడీ దొంగలు గణేష్, ప్రేమ చందు, పవన్ అనే ముగ్గురు వ్యక్తులను కలిశాడు. ఈ ముగ్గురు వ్యక్తుల పైన ములుగు, రామగుండం, భద్రాచలం, ప్రాంతాలలో రాబరీ కేసులు ఉన్నాయి. శ్రీకాంత్ ఈ ముగ్గురు వ్యక్తులను పిలిచి మా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది మీరు మాతో కలిసి పని చేస్తే మీ జీవితాలు బాగుపడతాయని వారిని ఒప్పించాడు. ఈ దొంగతనం కేసులో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించి పథకం వేశాడు. ఈయనకు చంద్రశేఖర్ అనే వ్యక్తి అవసరమైన మనుషులను సమకూర్చారు. దొంగతనానికి కావలసిన వ్యక్తులను సంప్రదించి వారిని సిద్ధిపేట ప్రాంతానికి తీసుకురావడంలో కీలకంగా సహకరించారు. శ్యామ్ రాజేష్ లను సిద్దిపేటలోని ఒక వ్యక్తి సహాయంతో శ్రీకాంత్ చెప్పిన పథకం ప్రకారం సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో దోపిడీ జరిగిన ఇంటిని చూపిస్తూ ముగ్గురు దోపిడీ దొంగలను అద్దె కారు లో తీసుకువచ్చి వదిలి వెళ్ళిపోతారు. శ్రీకాంత్ ఇచ్చిన పథకం ప్రకారం గణేష్, ప్రేమ చందు, పవన్ ముగ్గురు వ్యక్తులు దొంగతనం కంటే ముందు రోజు వచ్చి ఆ ఇంటిని రకి నిర్వహించి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలోని మల్లికార్జున వైన్స్ దగ్గర మందు తీసుకొని ఆ ఇంటికి ఒక వంద మీటర్స్ దూరంలో మందు తాగి, కత్తులు, మాస్కులు, తువాళ్లతో ప్రహరీ గోడ వద్దకు వెళ్లి రాత్రి సుమారుగా 8 గంటలకు గణేష్, ప్రేమ చందు, పవన్ దూకి లోపలికి ప్రవేశించారు. చంద్రశేఖర్ బయట కాపుగా ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవారిని ఇద్దరు పిల్లలను ప్రేమ చెందు, పవన్ లు భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద గల 8.4 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక లక్ష రూపాయలు నగదు, రెండు సెల్ ఫోన్లను తీసుకొని , అక్కడ ఉన్న చార్జింగ్ వైరుతో ఒక ఆడమనిషి చేతులను కట్టి, మిగతా వారిని అక్కడే గల తువాలతో చేతులు కట్టి ఇంటిని మొత్తం చిందర వందర చేసి విషం ఎవరికన్నా చెప్తే చంపేస్తామని బెదిరించి ముగ్గురు నిందితులు పారిపోయారు. ఈ ఇంట్లో దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను ప్రకాష్, వినయ్ అనే ఇద్దరు వ్యక్తులు దోపిడి సొత్తు అని తెలిసి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి సహకరించారు. గురువారం పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4.6 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, ఒక బైకు, 10 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు పరార్ లో ఉన్నట్లు ఆయనకొరకు గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు.ఈ కేసు విషయంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, ఎస్సై రాజేష్, చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్, రాజగోపాల్పేట ఎస్సై వివేక్, బెజ్జంకి ఎస్సై సౌజన్య, పోలీస్ సిబ్బంది రాజు సుభాష్ యాదగిరి స్వాములను సీపీ అభినందించారు

Leave A Reply

Your email address will not be published.