ముద్ర, కరీంనగర్ :
శ్రీరాముని ఆరాధించడం వలన సకల శుభఫలాలు కలుగుతాయని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని సత్యానికి నిర్వచనమని, వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండని పఠించిన గాని విన్నను గాని, మానసిక శారీరక శక్తి పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” డా.వి. నరేందర్ రెడ్డి గారు మరియు పరివారంతో కలిసి నాలుగవ రోజు సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభోత్సవం సందర్భంగా వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క గుణాలను అలవర్చుకొని విజేతలుగా నిలవాలని వారు కోరారు. వారు సీతను కనుగొన్న విధానం చాలా శాంతియుతంగా జరిగిందని ఆ విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించినట్లయితే సమాజంలో ఎటువంటి భేద భావాలు ఉండవని చెప్పారు

బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపెల్లి మహేశ్వర శర్మ గారి మార్గదర్శకమున నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రవచనాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని రోజు వారీ కార్యకలాపాలలో అవలంబించి విజయాలను సాధించాలని వారు సూచించారు.

కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి పలు భజనలు స్ఫూర్తి నింపాయి