Take a fresh look at your lifestyle.

మెనూ ప్రకారం పౌష్టికాహారం ఇవ్వాలి: కలెక్టర్ ఆదేశం

బాన్సువాడ, ముద్ర: మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, పూర్వ ప్రాథమిక విద్యలో మంచి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం బాన్సువాడ ప్రాజెక్టులోని తిరుమలాపూర్ గ్రామంలో అప్గ్రేడషన్ అంగన్వాడి సెంటర్ ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి పాఠశాలలో చిన్న పిల్లలు కలెక్టర్, సబ్ కలెక్టర్కు పూలతో స్వాగతం పలికారు. అనంతరం అంగన్వాడి సెంటర్ ను వారు సందర్శించి పిల్లలతో పాటలు పాడించి, బొమ్మలను చూపిస్తూ వాటి పేర్లు చెప్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ లోని వంటశాలను సందర్శించి ఫుడ్ మెనూ అడిగి తెలుసుకొని కొత్తగా వచ్చిన పిల్లలకు కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ ల చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అంగన్వాడి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత అంగన్వాడీ ప్రాంగణంలో గల గ్రౌండ్,ఆట వస్తువుల గురించి మాట్లాడి వాటిని నిర్మించడానికి కావలసిన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమల, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సీడీపీఓ, సూపవైజర్ మరియు మండల అధికారులు తహసీల్దార్, ఎంఈఓ, ఎంపీడీవో, గ్రామ సెక్రటరీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.