- శత్రుసేనలపై భారత సైన్యం వీరోచిత పోరాటం.
- త్రివిధ దళాల ధైర్యసాహసాలతో భారత్ గర్విస్తుంది.
- పాకిస్తాన్ కు ఇదే సరైన గుణపాటం.
- వైమానిక దళంలో పని చేసిన అనుభవం నాది.
- యుద్ద విమానాలలో పైలట్ గా విధులు నిర్వర్తించా.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేస్తున్న పోరాటం అనన్యాసామాన్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ కు సెల్యూట్ అని అన్నారు. భారత ప్రభుత్వం,దేశ ప్రజల లక్ష్యసాధన కోసం త్రివిధ దళాలు పాకిస్తాన్ లో,పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో శత్రుసేనలకు చెందిన తొమ్మిది స్థావరాలపై చేసిన దాడులు విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు గురువారం కోదాడలో ఓ ప్రవైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా తో మాట్లాడారు.. ప్రేరేపిత తీవ్రవాదాన్ని తుదముట్టించే ప్రక్రియలో త్రివిధ దళాలు చూపిన డైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తుందని ఆయన కొనియాడారు. భారత వైమానికదళంలో పనిచేసిన అనుభవం తనకుందని, అందులో యుద్ద విమానాల పైలట్ గా యుద్ద సమయంలో పనిచేసిన అనుభవాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ అనుభవంతో చెబుతున్నా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్గవాదాన్ని అణిచివేసేందుకు గాను త్రివిధ దళాలు సమర్ధవంతంగా,ఎంతో చాక చక్యంగా శత్రు శిబిరాలపై దాడులు జరిపి పాకిస్థాన్ కు సరైన గుణపాఠం నేర్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.