Take a fresh look at your lifestyle.

నా మనోవేదన తీరింది.. త్వరలో కొత్త రాజకీయ పార్టీ : కవిత

నా మనోవేదన తీరింది
లిక్కర్ కేసులో నన్ను నాలుగేళ్లు వేధించారు
శ్రీవారి దయతో ఆ కేసులో క్లీన్ చీట్ వచ్చింది
త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న
తెలుగు ప్రజలపై స్వామి ఆశీస్సులు ఉండాలి
జాగృతి అధ్యక్షురాలు కవిత

ముద్ర, తిరుపతి :

నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వేంకటేశ్వరస్వామి దయతో తీరిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత తన భర్తతో కలిసి శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు కాలినడకన వచ్చానన్నారు. సత్యం, న్యాయం , ధర్మం మావైపు ఉందని తాను ముందు నుంచే చెబుతూ వచ్చానన్నారు. చివరకు న్యాయ స్ధానం కూడా స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని కవిత ప్రకటించారు. ఈ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ఆయా ప్రాంతాల ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.