Take a fresh look at your lifestyle.

వరద నీటి కాలువ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ

మాదాపూర్, ముద్ర : శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ గఫూర్ నగర్ లోని జీహెచ్ఏంసీ పార్కు వద్ద రూ.11.55 లక్షలు (పదకొండు కోట్ల ఏభై ఐదు లక్షలు) రూపాయలు అంచనా వ్యయంతో, స్ట్రామ్ వాటర్ డ్రైన్ (వరద నీటి కాలువ) కు స్థానిక నాయకులతో కలసి పిఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరేకపూడి గాంధీ గౌరవ కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, సీనియర్ నాయకులతో కలసి శంకుస్థాపన చేశారు.ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్భంగా మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒక ఫైనాన్సియల్ క్యాపిటల్ నియోజకవర్గమని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చామని,ఇక ముందు కూడా మరింతగా అభివృద్ధి పథంలో తీసుకోని వెళతామని అన్నారు.కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూకొండాపూర్ డివిజన్ ఒక హైటెక్ డివిజన్ గా పేరు గాంచిదని,ఈ డివిజన్ లోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.ఒకప్పటి బస్తిలు ఇప్పుడు మౌలిక వసతులతో కూడిన కాలనీలుగా అభివృద్ధి చెందాయని అన్నారు. అదే స్థాయిలో గ్రేటర్ కమ్యూనిటీ కాలనీలు పెరిగాయని అన్నారు. కొండాపూర్ డివిజన్ ను మరింతగా అభివృద్ధి చేసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోను ప్రధమ స్థాయిలో నిలబెట్టటానికి కృషి చేస్తామని అన్నారు.శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, ఊట్ల కృష్ణ, మల్లెల శ్రావణ్ యాదవ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, మంగళరాపు తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, రజనీకాంత్, నరేష్ ముదిరాజ్, వినయ్, పిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.