Take a fresh look at your lifestyle.

నిధులలేమితో నిలిచిన చేనేత సంక్షేమ పథకాలు. -ఏండ్లు గడచిన బాధిత కుటుంబాలకు అందని ఎక్సిగ్రేషియా-చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకట నర్సు.

-చేనేతకు నిరాశే మిగిల్చిన రాష్ట్ర బడ్జెట్ – చేనేత రక్షణ, హామీల అమలుకు 2000 కోట్లు కేటాయించాలి.

ముద్ర, మోత్కూర్:
చేనేత పరిశ్రమ పరిరక్షణ, ప్రభుత్వ హామీల అమలుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు 2000 కోట్లు కేటాయించాలని కాని బడ్జెట్లో కేవలం 258 కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని విమర్శించ్చారు. అదివారం మోత్కూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన చేనేత రుణమాఫి, నేతన్న భరోసా దాదాపు సంవత్సరంన్నర గడచిన నిధుల లేమితో ఇప్పటికి అమలు కాలేదని (త్రిప్ట్) నేతన్న పొదుపు పథకంలో కార్మికులు ప్రతినెల ఆర్ డి (వన్)లో జమచేస్తున్నప్పటికి, ప్రభుత్వం జమచేయవలసిన ఆర్ డి (టూ)లో దాదాపు పది నెలలుగా పెండింగ్ ఉన్నాయని తెలిపారు. చేనేత కొత్త పెన్షన్ ల కోసం నేతన్నలు ఏండ్లుగా ఎదిరిచూస్తున్నారని, చేనేత కార్మికుడు మరణిస్తే చెల్లించవలసిన ఎక్సీ గ్రేషియా సంవత్సరాలు గడచిన బాధిత కుటుంబాలకు అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత పరిశ్రమ పరిరక్షకు హామీల అమలుకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించాలని, కాని ప్రభుత్వం కేవలం 258 కోట్లు కేటాయించి చేతులుదులుపుకోవడం సరికాదని ఇచ్చిన హామీల అమలుకు 2000 కోట్లు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.