రాష్ట్ర బడ్జెట్ లో దళితులకు తీరని అన్యాయం. -బడ్జెట్ లో దళిత సంక్షేమానికి నిధులేవి. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కురుమేటి యాదయ్య.
ముద్ర, మోత్కూర్:
దళితుల సంక్షేమం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చిన ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య విమర్శించ్చారు. మోత్కూర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బడ్జెట్ లో ఎస్సి సంక్షేమానికి రూ 40,232 కోట్లు కేటాయించగా ఈ సారీ కేవలం రూ 11, 784 మాత్రమే కేటాయించడం తీవ్ర అన్యామని అన్నారు. దళితుల అభివృద్ధి పేరుతో అనేక మాటలు చెప్పి ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమైందని అన్నారు. గత బీ ఆర్ స్ ప్రభుత్వం దళితబందు పేరుతో దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించి పూర్తిగా అమలు చేయలేక పోయిందని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సిస్ పథకం ద్వారా 12 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడ కేటాంచకపోవడం దారుణమని దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి సంక్షేమాన్ని పక్కనపెట్టడం బాధకరమని, దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే బడ్జెట్ సవరించి కనీసం 50 వేలకోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.