రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వ హామీలను అమలు చేయాలని బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి
ముద్ర, నారాయణపేట :
ప్రభుత్వ హామీలను అమలు చేయాలని…రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి సాయిబన్న డిమాండ్ చేశారు. బిజెపి నారాయణపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ప్రభుత్వ హామీల అమలు… ప్రజా సమస్యలపై తాసిల్దార్ కు సోమవారం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు జ్యోతి సాయిబన్న ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు సరైన సమయంలో లబ్ధిదారులకు అందడం లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం వంటి హామీలను విస్మరించిందన్నారు. అలాగే మండలంలో భూ సమస్యలు అనేకంగా ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు అందించారని కానీ వాటి సమస్యలు నేటికీ పరిష్కారం కాక పెండింగ్లోనే ఉన్నాయన్నారు. అలాగే స్థానిక, ఆదాయ ధ్రువపత్రాల జారీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందేలా చూడాలన్నారు. మండల పరిధిలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందించిన వారిలో ఆయా గ్రామాల సర్పంచులు చంద్ర శేఖర్ గౌడ్, మణెమ్మ బాలు, ఉపసర్పంచ్ లు సురేష్, రాధాకృష్ణ, భజరంగ్, మాజీ సర్పంచులు శివప్ప, రామకృష్ణ, నాయకులు నారాయణ రెడ్డి , కార్తీక్ , రాము తదితరులు పాల్గొన్నారు. కాగ పేట మునిసిపల్ కార్యాలయంలో బీజేపీ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హామీల అమలుపై వినతి పత్రం అందించారు.