Take a fresh look at your lifestyle.

కంది సెంట్రల్ జైలు గిర్మాపూర్ గురుకుల బాలుర పాఠశాలలో న్యాయ అవగహన సదస్సు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సెంట్రల్ జైలు కంది నందు ఆకస్మికంగా తనిఖీ మరియు గిర్మాపూర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలుర పాఠశాల నందు న్యాయ అవగహన సదస్సు నిర్వహించారు.


ఈతనిఖీలో న్యాయమూర్తి సెంట్రల్ జైలు నందు ఉన్న బెరక్లూ,గదులు,వంట గది,బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను,భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు అన్ని ఖైదీలు బెరక్లూ క్షున్నంగా పరిశీలించి వారికీ కావాల్సిన అవసరాలు,సదుపాయాలు అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ కు తెలిపారు.వారికీ ఖైదీలతో వారికీ సమయానికి బైల్స్,ములాఖత్ అందుతున్నాయ,కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు.


గిర్మాపూర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య మాట్లాడుతూ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సంరక్షణను తోడ్పడాలని అన్నారు.అందరు క్రమశిక్షణగా ఉంటూ పరీక్షలను అధైర్య పడకుండా బాగా రాయాలి అప్పుడే ఉన్నత అవకాశాలను అందుకోవాలన్నారు.అదేవిదంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని ఉపాధ్యాయులకు తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి అని అన్నారు ప్రత్యేకంగా బాలల సంరక్షణ చట్టం,ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు,బాల కార్మిక నిరోధక చట్టం మరియు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.ఎవరికైనా న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం,సంగారెడ్డిని సంప్రదించాలన్నారు.
ఈఅవగాహన సదస్సులో బి.సౌజన్య కార్యదర్శి,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, సంగారెడ్డి,లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులు జైలు, అధికారులు,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.