Take a fresh look at your lifestyle.

పదవీ విరమణ పొందిన అధికారులను సన్మానించి, జ్ఞాపికలు అందచేసిన డిసిపి

  • శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి.
  • మంచిర్యాల డిసిపి భాస్కర్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పోలీస్ శాఖ లో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను గురువారం రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్ పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులు,కుటుంబసభ్యులతో  కలిసి శాలువా,పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.పదవీ విరమణ పొందిన అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు,ఎన్.నరేష్ బాబు ఇన్స్పెక్టర్,జే.సమ్మయ్య ఆర్ఎస్ఐ ఇన్స్పెక్టర్ లను సన్మానించారు.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితులలో సంఘవిద్రోహశక్తుల తో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థాయికి ఎదిగారని,పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారో గ్యాలతో,సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు.తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవా లని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారు లను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.ఈ కార్యక్రమంలో13బెటాలియన్ కమాండెంట్ మూర్తి,స్పెషల్ బ్రాంచ్ ఎసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్, ఎఆర్ ఎసిపి ప్రతాప్, ఏఓ శ్రీనివాస్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్,మల్లేషం,శ్రీనివాస్, వామన మూర్తి, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి,సంధ్య, మనోజ్ కుమార్,సిసి హరీష్, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.