ముద్ర, మల్యాల: మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన షేక్ హరీష్ మూడు రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి జగిత్యాల లోని తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కి వెళ్లారు. సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో ఇంటికి చేరుకున్న హరిఫ్ ఇంటి తాళం పగలగొట్టి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీరువాలో ఉన్న 5 తులాల బంగారు, 25 వెలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మల్యాల పోలీసులు పరిశీలించి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామన్నారు.