- తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు.
- గుండాగానీ రాములుగౌడ్ బిఆర్ఎస్ జిల్లానాయకులు.
ముద్ర, తుంగతుర్తి: సమాజంలోని అట్టడగువర్గాలకు సమన్యాయం కావాలంటే సామాజిక న్యాయం తోటే సాధ్యం అని నమ్మి సాధన కోసం పోరాడిన మహనీయుడు జ్యోతిబాపూలే అని మాజీ ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉండగానే రాములు గౌడ్ లు అన్నారు.తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం పూలె జయంతి సందర్బంగా బిఆర్ఎస్ శ్రేణుల తో కలిసి పూలే విగ్రహానికి పూలమాల వేసినివాళి అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబాపూలే చూపిన మార్గంలో పయనిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు గాజుల యాదగిరి, గోపగాని శ్రీనివాస్, గోపగాని రమేష్,బొంకూరి శ్యామ్ కొండగడుపుల వెంకటేష్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, మల్లి ఖార్జున్, రాంబాబు, గోపగాని వెంకన్న, నల్లబెల్లి వెంకన్న, బొంకూరి మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
