Take a fresh look at your lifestyle.

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం

– మే డే వేడుకలు ఘనంగా నిర్వహణ
ముద్ర హైదరాబాద్ :
ఫిల్మ్ ఫెడరేషన్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన వల్లభనేని అనీల్ కుమార్ ఈరోజు అధికారికంగా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉదయం జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.


అదే సమయంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు సినీ, కార్మిక సంఘాల ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఫెడరేషన్ అభివృద్ధికి అనీల్ కుమార్ నాయకత్వం ఎంతో దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన విజయం కార్మికుల ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఫెడరేషన్ సభ్యుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

తన ప్రసంగంలో అనీల్ కుమార్ మాట్లాడుతూ, సభ్యుల నమ్మకానికి తాను కృతజ్ఞతలు తెలుపుతూ, ఫెడరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.