Take a fresh look at your lifestyle.

కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

  • ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన మున్సిపల్ కమిషనర్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. పలు ఆలయాలలో జరిగిన శ్రీ సీత రామచంద్రుల కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి కల్యాణాన్ని తిలకించి తరించిపోయారు.పట్టణంలోని ధరూర్ క్యాంపు శ్రీకోదండ రామాలయం 46వ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి మూలవిరాట్టు దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.శ్రీ సీత రామచంద్రుల ఉత్సవ మూర్తులను భాజ బజంత్రీలు మంగళవాయిద్యాల మధ్య పల్లకిలో ఉరేగింపుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలోకి తీసుకొని వచ్చారు. మున్సిపల్ కమిషనర్ స్పందన స్వామివార్ల కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని రాగ వేద బ్రాహ్మణుల మత్రోచ్చరణల మధ్య కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. అలాగే పట్టణంలోని మర్కడేయ దేవాలయం అధ్వర్యంలో అంగడి బజారులో సీత రాముల కళ్యాణాని ఘనంగ నిర్వహిచారు.అరవింద్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయం, విద్యానగర్ ఆంజనేయస్వామి, చిన్న గట్టు ఆంజనేయ స్వామి ఆలయాలలో శ్రీరామ నవమి పురస్కరించుకొని సీత రాముల కళ్యాణం నిర్వహించారు.ఆయా ఆలయాలో కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణ, అర్బన్ రూరల్, మండలాలో పలు ఆలయాలతో సారంగాపూర్ మండలం రంగపేట ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్ , బోగ శ్రావణి దంపతులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.డిఎస్పి రఘు చందర్ నేతృత్వంలో పట్టణ సిఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు గౌరీశెట్టి హరీష్, మాధవ రెడ్డి, ప్రసాద్ రావు, నరేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.