- సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి
ముద్ర.వీపనగండ్ల : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బాల్ రెడ్డి డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా సమస్యలపై గ్రామాలలో సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గోపాల్ దీన్నే గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ ప్రజలకు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని,రైతులకు పూర్తిస్థాయిలో పంట రుణమాఫీ, రైతుబంధు,మహిళలకు 2500 రూపాయలు,వంట గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు పూర్తిస్థాయిలో అందలేదని అన్నారు. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు తులం బంగారం,వృద్ధులకు,వికలాంగులకు పింఛన్లు,ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికీ అందలేదని అన్నారు.మండలంలోని గ్రామాలలో ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజ్ సమస్య ఉందని,గోపాల్దిన్నె గ్రామానికి ఒక్క బస్సు మాత్రమే రావడం జరుగుతుందని,మండల కేంద్రానికి వివిధ పనులు నిమిత్తం ప్రజలు,చదువుకోడానికి కళాశాలకు విద్యార్థులు వెళ్లాలంటే కాలినడకన వెళ్లడం తప్పడం లేదని వెంటనే బస్సు సౌకర్యం కల్పించి,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటయ్య,రాముడు,రంగస్వామి గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.