ముద్ర, తాండూర్: అభివృద్ధిలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న రజక సంఘ కులస్తులకు చేయూతనందిస్తానని ఆర్ బి ఎల్ అధినేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలో రజక సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రజక సంఘ భవనానికి తన సొంత స్థలంలో రెండు గుంటల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సంఘ అభివృద్ధి కోసం తప్పకుండా తన వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. రజక సంఘానికి చేయూతనందించిన శ్రీనివాస్ రెడ్డి కి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, వివిధ పార్టీలమున్సిపల్ కౌన్సిలర్లు, తాండూర్ పట్టణ రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.