Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లాలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వి. సీతారామ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాట్స్ (SATS) ఆధ్వర్యంలో ఈ శిబిరాలు నిర్వహించబడనున్నాయి.
ఈ శిబిరాలు ఏప్రిల్ 24 నుండి జూన్ 7 వరకు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించబడతాయి. పి.డి., పి.ఇ.టి లు మరియు సీనియర్ క్రీడాకారులు శిక్షణా శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సీనియర్ క్రీడాకారులు తప్పనిసరిగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న అనుభవం కలిగి ఉండాలి.
దరఖాస్తులతో పాటు సంబంధిత క్రీడా ధృవపత్రాలను జతపరచాలని సూచించారు. స్థానికంగా శిబిరాలు నిర్వహించగలిగే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, గ్రామీణ మరియు కొత్త కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 23లోగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, ఐడీఓసి (IDOC) భవనం, నాగర్ కర్నూల్ వద్ద దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.