Take a fresh look at your lifestyle.

శ్రీశైలం వెళ్లే ప్రవేట్ బస్సు బోల్తా

  • యాత్రికులకు తప్పిన పెను ప్రమాదం.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట బస్టాండ్ సమీపంలో శ్రీశైలం వెళుతున్న ప్రవేట్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయి గోడకు ఢీ కొట్టిన టూరిస్ట్ బస్సు బోల్తా పడి పలువురికి గాయాలుఅయ్యాయి.గాయపడ్డ వారిని 108 వాహనంలో హుటాహుటిన సమీప ఈగలపెంట జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నల్లమల ప్రాంతంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం బస్టాండ్ సమీపంలో ప్రైవేటు బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఈగల్పెంట ఏఎస్ఐ బాలు నాయక్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు జనగామ జిల్లా నుండి టీఎస్ 08 యూఏ 23 29 నెంబర్ గల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో యాత్రికులు తమ కుటుంబంలో వివాహం జరిగిన తర్వాత శ్రీశైలం దైవ దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో బస్సు బ్రేక్ ఫెయిల్ అయి దోమలపెంట బస్టాండు సమీపంలో ఒక ఆవును ఢీ కొట్టి బస్సు పక్కనే ఉన్న గోడకు ఢీ కొట్టి బోల్తా పడినట్లు సమాచారం తెలిపారు.బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చిన్న పిల్లలతో సహా 40 మంది ఉన్నారని ఏ స్ ఐ బాలు నాయక్ తెలిపారు, కొంత మందికి తీవ్రగాయాలు పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయని ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని తెలిపారు.స్వల్ప గాయాలైన క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం తరలించారు.

Leave A Reply

Your email address will not be published.