Take a fresh look at your lifestyle.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి లక్ష్మణ్ కుమార్..

ఇస్రాజ్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అడ్లూరి..

ముద్ర, గొల్లపల్లి:

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లె గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి అన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తప్ప తాలు పేరుతో క్వింటాల్ కు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు కోతల విధించేవారని మంత్రి అన్నారు. మధ్యవర్తుల దోపిడీ లేకుండా రైతులకు నేరుగా లాభం చేకూరే విధంగా కొనుగోలు కేంద్రాల్లో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.