Take a fresh look at your lifestyle.

భారీగా ఐఏఎస్ ల బదిలీలు

45 మందికి స్ధానచలనం
జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా
పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్
జితేశ్ వి. పాటిల్ కు ఎస్పీడీసీఎల్ సీఎండీ బాధ్యతలు
విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌కు అవకాశం
మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పరిపాలనా అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కలెక్టర్ల స్థాయిలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.. మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. టీఎస్‌జీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీ నియామకం జరిగింది. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్.. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌కు అవకాశం కల్పించారు. ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం కార్యదర్శిగా గౌరవ్‌ ఉప్పల్‌.. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఎం.హనుమంతరావు.. ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారిగా డి.దివ్యను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

01. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శి – రాహుల్‌ బొజ్జా02. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ – సంజయ్ కుమార్
03. ఎస్పీడీసీఎల్ సీఎండీ – జితేశ్ వి. పాటిల్
04. కొత్త డిస్కం సీఎండీ – ముషారఫ్ ఫారూకీ
05. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – ఈ. శ్రీధర్
06. ఐటీ అండ్ సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – ఎన్. శ్రీధర్
07. ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ – గౌరవ్ ఉప్పల్‌
08. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ – ఎం. దాన కిషోర్
09. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీ – సిక్తా పట్నాయక్
10. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌ – బి.ఎం. సంతోష్
11. లేబర్ స్పెషల్ కమిషనర్‌ – పమేలా సత్పతి
12. కో ఆపరేటివ్ కమిషనర్‌ – పి.ఎస్. రాహుల్ రాజ్
13. దేవాదాయశాఖ కమిషనర్‌ – ఎం.హనుమంతరావు
14. ప్రజావాణి రాష్ట్ర నోడల్‌ అధికారి – డి.దివ్య
15. మహబూబ్‌నగర్ కలెక్టర్‌ – బి. విజయేంద్ర
16. కరీంనగర్ కలెక్టర్‌ – చిత్ర మిశ్రా
17. హన్మకొండ కలెక్టర్‌ – చాహత్ బాజ్‌పాయ్
18. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ – అంకిత్
19. యాదాద్రి కలెక్టర్‌ – అనురాగ్ జయంతి
20. జనగాం కలెక్టర్‌ – సందీప్ కుమార్ ఝా
21. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ – రిజ్వాన్ బాషా షేక్
22. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ – స్నేహ శబర్ష్
23. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ – గరిమా అగర్వాల్
24. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ – దీపక్ తివారీ
25. వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ – ఉమా శంకర్ ప్రసాద్
26. మెదక్ జిల్లా కలెక్టర్‌ – ప్రతిమా సింగ్
27. మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్‌ – ఫైజాన్ అహ్మద్‌

Leave A Reply

Your email address will not be published.