మహాదేవపూర్, ముద్ర:
జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆకుతోట సుధాకర్, కార్యదర్శిగా సూరారం గ్రామానికి చెందిన మడక ప్రతాప్ ను రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు నియమించారు. వీరిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కటకం అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ సిసి బ్యాంకు చైర్మన్ చల్ల తిరుపతి, ఎనకపల్లి సర్పంచ్ లక్ష్మణ్, కుదురుపల్లి మాజీ సర్పంచ్ సమ్మయ్య, శివరాజు, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ నిసన్మానించారు.నూతన పదవులు చేపట్టిన నాయకులు రాష్ట్ర పిసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు మరియు ఐటి శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతఙ్ఞతలు తెలిపారు.