Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర ధాన్యం చెక్ పోస్ట్

 

మహాదేవపూర్, ముద్ర: కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో రైతులకు మద్దతు ధరను సమర్థంగా అందించేందుకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకునే దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ మరియు పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో 24 గంటలు నిరంతర పహారా నిర్వహిస్తాయని వెల్లడించారు.అంతరాష్ట్ర చెక్‌పోస్టు ద్వారా వాహనాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని, నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాములు, ఎస్‌.ఐ తమాషా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీమతి శ్రీజ, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు సురేందర్ రెడ్డి, రాజు, గ్రామ పరిపాలన అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.