ముద్ర, కొమురవెల్లి : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక లక్ష యాభై వేల విలువగల లాకర్ను ఆలయ కార్య నిర్వహణ అధికారికి ఎస్బిఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ భువనేశ్వరి చేతుల మీదుగా లాఖరు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి అన్నపూర్ణ మాట్లాడుతూ మల్లన్న ఆశీస్సులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులపై చల్లని దీవెనలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, సిద్దిపేట రీజినల్ మేనేజర్ మారుతి, సిద్దిపేట జోనల్ అధికారి క్రాంతి కుమార్, కొమరవెల్లి బ్రాంచ్ మేనేజర్ అర్జున్, ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు సురేందర్ రెడ్డి మరియు ఎస్బిఐ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.