Take a fresh look at your lifestyle.

అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -ఎస్పీ సునిత రెడ్డి

ముద్ర, వనపర్తి:
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా ఏప్రిల్ -01 నుంచి ఏప్రిల్ -30 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం నిషేధం అని ప్రజా జీవనాన్ని అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటు లేదు అని స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయ అందరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందాలని. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయి అని ఆమె అన్నారు. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.