ముద్ర, తాండూర్:
ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలరని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం 5 కె రన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తాము ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో మార్పు రావాలని, కల్తీ లేని ఆహార పదార్థాలు తీసుకోవాలని ముఖ్యంగా యువకులు శారీరకంగా దృఢంగా ఉండేందుకు మార్నింగ్ వాక్, వ్యాయామం చేయాలని తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం నుండి విలేమున్ చౌరస్తా వరకు ఉత్సాహంగా 5కె రన్నింగ్ లో ఎమ్మెల్యే పాల్గొని అందరిని ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో తారా సింగ్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.