Take a fresh look at your lifestyle.

పసిపాప మరణానికి కారణం అయిన వారిని అరెస్టు చేయాలి. సిపీయం ఆధ్వర్యంలో నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్:
నాగర్ కర్నూల్, కుమ్మెర జాతరలో చనిపోయిన చిన్నారి మరణానికి నిరసనగా మెదక్ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మెదక్ పోస్టాపీసు వద్ద నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ.. పాప చావుకు కారణం అయిన పెత్తందారులను వెంటనే అరెస్ట్‌ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
ఈ నిరసనలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె. మల్లేశం, జిల్లా కమిటి సభ్యులు, పార్టీ సభ్యులు సంతోష్, యశోద, కమల, దుర్గ, యశోద, కవిత, షౌకత్, కిస్టయ్య, యాదగిరి, వెంకట్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.