సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
శ్రీ పార్వతీ బుగ్గ రాజేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా హుండీ ఆదాయం రూ. 5,93,453లు వచ్చినట్లు దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐ విజయ లక్ష్మి మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకొని నిర్వహించిన వేలంపాట మరియు అన్నదానం హుండి, కట్నాలు, ప్రసాదాలు, హుండీ లెక్కింపు ద్వారా దేవస్థానం ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దేవస్థానం కు వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ శాఖ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ చైర్మన్ బాగన్నగారి కరుణాకర్ ముదిరాజ్ , ఏఎస్ఐ కిష్టయ్య, ఈవో శ్రీధర్ రెడ్డి, ఆలయ పూజారి సీతారామ శర్మ మరియు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.