Take a fresh look at your lifestyle.

మద్యం మత్తులో వాహనాలు తోలడం ప్రమాదం

  • వారం రోజుల్లో 350 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు.
  • పట్టుబడ్డ వారిలో 8 మందికి ఒక్కరోజు జైలు. ఇతరులకు జరిమానా.
  • కె.నరసింహ , ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారనీ, ఇతరులను ప్రమాదంలో పడేస్తున్నారు అని, ప్రమాదాల నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా విసృతంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం అని ఎస్పి నరసింహ తెలిపినారు. గత వారం రోజులుగా 350 మంది పై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశాను అన్నారు, జరిమానా మార్పు కోసమే అన్నారు. ఎవ్వరూ కూడా మద్యం మత్తులో వాహనాలు తోలవద్దు అని ఎస్పి కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పలుమార్లు పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అని ఎస్పి హెచ్చరించారు. రోడ్లపై ప్రయాణ సమయంలో ముందు జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించవచ్చు అని ఎస్పీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.